Madhavnagar ROB Approvals | కాంగ్రెస్​ కృషితోనే మాధవ్​నగర్​ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు..

కాంగ్రెస్​ నాయకుల కృషితోనే మాధవ్​నగర్​ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు వచ్చాయని డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Madhavnagar ROB Approvals | కాంగ్రెస్​ నాయకుల కృషితోనే మాధవ్​నగర్​ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు వచ్చాయని డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.

Madhavnagar ROB Approvals | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (Madhavnagar Railway Overbridge) నిర్మాణానికి 101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. డిచ్‌పల్లి–నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నంబర్ 193 వద్ద నాలుగు వరుసల ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందున్నారు. గతంలో రూ.93.12 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.101.80 కోట్లకు పెంచుతూ నిర్ణయించడంతో నిధుల అనుమతులకు మార్గం సుగమమైందన్నారు.

Madhavnagar ROB Approvals | పీసీసీ చీఫ్​,ప్రభుత్వ సలహాదారు..

ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండేళ్లుగా అదనపు నిధుల మంజూరు, సవరించిన అంచనాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని రామకృష్ణ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆర్వోబీ పనులపై చర్చించి నిర్మాణ పనులను వేగం చేసేందుకు పూనుకుందన్నారు. కాని ఏమీ చేతకాని ఎంపీ అర్వింద్​ తానే ఏదో చేసి నిధులు రప్పించానని చెప్పటం ఎలా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డే అన్నట్టుందని ఎద్దేవా చేశారు. ఎంపీ వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

ఇది కూడా చదవండి..: Model School Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. మోడల్​ స్కూళ్లలో ఔట్​సోర్సింగ్​ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *