అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Road Accident | వేగంగా వస్తున్న లారీ స్కూటీని ఢీకొంది. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
స్కూటీ నుజ్జునుజ్జు..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పూలాంగ్ నుంచి వస్తున్న లారీ ఆర్ఆర్ చౌరస్తా వద్ద స్కూటీనీ ఢీకొంది. లారీ వేగం ధాటికి స్కూటీ టైర్ల కింద ఇరుక్కుని నుజ్జునుజ్జయ్యింది. దీంతో స్కూటీపై వెళ్తున్న సాయి అనే వ్యక్తికి గాయలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని జీజీహెచ్ (GGH)కు తరలించారు. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Gambling Crackdown | జూదంపై ఉక్కుపాదం.. జిల్లాలో నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు