Telangana Cultural Heritage | తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే..

తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదేనని నగర మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Telangana Cultural Heritage | తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదేనని నగర మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు. నగరం (Nizamabad)లోని ఖలీల్​వాడీలోని అంబేద్కర్​ భవన్​లో జిల్లా యువజన, క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు 2026-27లను ప్రారంభించారు.

Telangana Cultural Heritage | సంస్కృతి సంప్రదాయాలే మూలస్తంభాలు..

మేయర్ ఉమారాణి రమేష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. సంస్కృతీ సంప్రదాయాలే సమాజానికి మూలస్తంభాలని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాగి ఉన్న యువతీయువకుల సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చక్కటి వేదికగా ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని చాటిచెప్పాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు, న్యాయనిర్ణేతలు  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Medical College Ragging | ర్యాగింగ్​ కోరల్లో మెడికల్​ కళాశాల.. జూనియర్లపై సీనియర్ల ఆగడాలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *