Water Tanker Strike | వాటర్​ ట్యాంకర్​ యజమానుల సమ్మె విరమణ

హైదరాబాద్​ నగరంలో నీటి ట్యాంకర్​ యజమానులు సమ్మె విరమించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Water Tanker Strike | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో నీటి ట్యాంకర్​ యజమానులు సమ్మె విరమించారు. బుధవారం వారు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​తో సమావేశం అయ్యారు. అనంతరం సమ్మెపై వెనక్కి తగ్గారు.

నగరంలో అక్రమ బోర్లపై హైడ్రా కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. చెరువుల పరిధిలో బోర్లు వేసి, అక్రమంగా ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది. దీంతో ప్రైవేట్​ ట్యాంకర్​ ఓనర్లు సమ్మె బాట పట్టారు. మంగళవారం నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో బుధవారం వారితో హైడ్రా కమిషనర్​ చర్చలు జరిపారు. దీంతో నీటి సరఫరా పునరుద్ధరణకు అంగీకరించారు.

Water Tanker Strike | ఓఆర్​ఆర్​ బయట నుంచి..

వాటర్ ట్యాంకర్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైడ్రా కమిషనర్​ చర్చించారు. అనంతరం ఔటర్​ రింగ్​ రోడ్డు బయట నుంచి నీటిని తోడి నగరంలో విక్రయించాలని హైడ్రా సూచించింది. ఈ మేరకు యజమానులు సైతం అంగీకరించారు.

Water Tanker Strike | అనుమతులు పొందిన తర్వాత..

నీటి ట్యాంకర్ల యజమానులు సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందిన తర్వాత ప్యూర్​ (Peri Urban Region) ప్రాంతం నుంచే బోరు నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు సంఘం సభ్యులు అంగీకరించారు. నగరంలో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో నగరంలోని బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయొద్దని కమిషనర్​ సూచించారు. వాణిజ్య బోర్ల ద్వారా భూగర్భ జలాలు మరింత పడిపోయి, ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు. దీంతో ఓఆర్​ఆర్​ బయటి నుంచి నీరు తెచ్చి సరఫరా చేసేందుకు ట్యాంకర్ల యజమానులు అంగీకరించారు.

Water Tanker Strike | నీటి ఎద్దడి

నగరంలో ఇప్పుడే నీటి ఎద్దడి మొదలైంది. ముఖ్యంగా అధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతాల్లో నీరు సరిపోవడం లేదు. నీటి కొరతతో హైటెక్​ సిటీ, మాదాపూర్​లోని కాలేజీలకు దీపావళి సెలవులను ముందుగానే ఇచ్చారు. నగరవాసులకు జలమండలి సరఫరా చేసే కుళాయి నీరు, ట్యాంకర్లు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో పలువురు అక్రమంగా బోర్లు వేసి నీటిని అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో హైడ్రా చర్యలు చేపట్టింది. నగరంలో భూగర్భ జలాలకు ఇబ్బందులు తలెత్తకుండా.. నీటి సరఫరా చేయాలని యాజమానులకు సూచించింది.

దీనిని కూడా చదవండి : Interstate Theft Gang | అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *