Armoor RDO Office | ఆర్మూర్‌ ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు భవనం మంజూరు

ఆర్మూర్​లో ఆర్డీవో, తహశీల్దార్​ కార్యాలయాలకు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Armoor RDO Office | ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ (Armoor) డివిజన్‌కు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పట్టణంలో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల కోసం కొత్త భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Armoor RDO Office | జిల్లాకు రెండు భవనాలు

రెవెన్యూ (డీఏ-సీఎంఆర్ఎఫ్) శాఖ ఈ నెల 4న జీవో ఆర్టీ నం.690 విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 7 తహశీల్దార్ కార్యాలయాలు, ఒక ఆర్డీవో కార్యాలయం, 3 ఆర్డీవో-తహశీల్దార్ కంబైన్డ్ కార్యాలయాల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు  రెండు భవనాలు మంజూరయ్యాయి. ఆలూర్ తహశీల్దార్ కార్యాలయం, ఆర్మూర్ ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయం (కంబైన్డ్) ఉన్నాయి. దీంతో పాటు నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయం, నర్సాపూర్ (మెదక్), మహబూబాబాద్ కంబైన్డ్ కార్యాలయాల నిర్మాణానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్మూర్‌లో ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న పాత భవనంలో తహశీల్దార్ కార్యాలయం నడుస్తున్న నేపథ్యంలో ఈ కొత్త భవన మంజూరు పట్ల ప్రజలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Farmer Crop Loans | ఎల్​నినో నేపథ్యంలో రైతాంగానికి బాసటగా నిలవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *