అక్షరటుడే, కామారెడ్డి: Police Save Man | కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని మాచారెడ్డి పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
Police Save Man | భార్యతో గొడవపడి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి Kamareddy జిల్లా అక్కాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గురువారం రాత్రి తన ఇంట వద్ద భార్యతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు మాచారెడ్డికి చేరుకుని స్థానిక చెరువులోకి దిగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికుడు మహేందర్ రెడ్డి వెంటనే అప్రమత్తమై 112 డయల్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎస్సై SI ఆదేశాల మేరకు మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డు రమేష్ క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. 112కి కాల్ చేసిన మహేందర్ రెడ్డి సహకారంతో చెరువులో ఉన్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
Police Save Man | కుటుంబ సభ్యులకు అప్పగింత..
అనంతరం సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, అతని కుమారుడిని అక్కడికి పిలిపించారు. పోలీసులు ఆ వ్యక్తికి ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు పలు సూచనలు చేసి అతడిని క్షేమంగా ఇంటికి పంపించారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఆపద సమయంలో వేగంగా స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీస్ సిబ్బంది గంగాధర్, రమేష్‌తో పాటు సమయానికి సమాచారం అందించి సహాయపడిన మహేందర్ రెడ్డిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.