Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్​ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Indiramma Housing Scheme | జిల్లాలో (Nizamabad) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ భుజంగరావుతో కలిసి పాల్గొన్నారు.

Indiramma Housing Scheme | ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి సంబరాలు..

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారు ఎల్‌.లిఖిత ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. లబ్ధిదారుకు, ఆమె కుటుంబ సభ్యులకు కలెక్టర్‌ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం బాణాసంచా కాలుస్తూ దీపావళి సంబరాలను జరుపుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సొంతింటి కలను సాకారం చేసుకున్న తమ ఇంట్లో తొలి దీపావళి పండుగను జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జరుపుకోవడం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Indiramma Housing Scheme | సొంత ఇల్లు ఉండడం చిరకాల కోరిక..

ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కలిగి ఉండటం చిరకాల వాంఛ అని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఎవరికి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామని, నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇంటి నిర్మాణ ప్రగతిని అనుసరిస్తూ నాలుగు దశలలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం జమ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఇన్​ఛార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారిణి గీత, డీఆర్డీవో సాయన్న, బోధన్ ఆర్డీవో విజయకుమారి, స్థానిక సర్పంచ్‌ సాయిలు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజాగౌడ్‌, హౌసింగ్‌ డీఈ గంగాధర్‌, ఎంపీడీవో శంకర్‌నాయక్‌, తహశీల్దార్‌ దత్తాద్రి, స్థానిక నాయకులు పులి శ్రీనివాస్‌, బి.రాంమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: రోగుల సమస్యలు వినే సమయం..సూపరింటెండెంట్ కు లేదటా..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *