Borewell Water Flow | భూపాలపల్లిలో ఊహించని వింత.. మోటార్ లేకుండానే బోర్ల నుంచి వస్తున్న వాటర్

ఒకవైపు ఎల్‌నినో (El Nino) ప్రభావంతో వర్షాలు పడక భూగర్భ జలాలు (Groundwater) అడుగంటిపోతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Borewell Water Flow | ఒకవైపు ఎల్‌నినో (El Nino) ప్రభావంతో వర్షాలు పడక భూగర్భ జలాలు (Groundwater) అడుగంటిపోతున్నాయి. రిజర్వాయర్లు సైతం డెడ్ స్టోరేజీకి చేరుతుండటంతో నీటిని పొదుపుగా వాడాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. బోర్లలో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక వింత ఘటన వెలుగు చూసింది. మహదేవపూర్ మండలం పూసుకుపల్లి శివారులో మోటార్ అవసరం లేకుండానే బోర్ల నుంచి నీరు నిరంతరం ఉబికివస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Borewell Water Flow |  నిరంతర జలధార..

గత వర్షాకాలంలో పూసుకుపల్లి శివారులోని వ్యవసాయ పొలాల్లో రైతులు వేసిన మూడు బోర్ల నుంచి ఈ వింత చోటుచేసుకుంటోంది. సాధారణంగా కరవు పరిస్థితుల్లో భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోతాయి. కానీ, ఇక్కడ మాత్రం కనీసం మోటార్లు (Motors) కూడా అమర్చకపోయినా, ఈ మూడు బోర్ల నుంచి స్వయంచాలకంగా నీరు బయటకు ప్రవహిస్తోంది.

Borewell Water Flow | పంటలు ఎండిపోతున్న సమయంలో..

తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ, మోటార్ సహాయం లేకుండా నిరంతరంగా నీరు పైకి రావడం చూసి స్థానిక రైతులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకపక్క నీటి కొరతతో పంటలు ఎండిపోతున్న సమయంలో, తమ గ్రామంలో ఇలా మోటార్ లేకుండానే నీళ్లు రావడంపై స్థానికంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ ఘటనను చూసేందుకు పక్క గ్రామాల ప్రజలు కూడా తరలివస్తున్నారు.

ఇది కూడా చదవండి: Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. ఫ్లాట్‌గా ప్రధాన సూచీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *