అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET UG 2026 Exam | ఎంబీబీఎస్ MBBS, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే యూజీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) – 2026కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు (ఆదివారం, మే 3) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది.
NEET UG 2026 Exam | 73 వేలకు పైగా
యూజీ నీట్‌కు తెలంగాణలో 73 వేలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నందున 1:30 గంటలకే గేట్లు మూసేస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు.
NEET UG 2026 Exam | దేశవ్యాప్తంగా 566 నగరాల్లో
డీఎంఈ డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్ నోడల్ ఆఫీసర్‌గా, అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం.భగవత్ పోలీస్ ప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద డ్యూయల్ లేయర్ ప్రిస్కింగ్, జామర్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా నిఘా ఉంచారు.
ఇక దేశవ్యాప్తంగా 566 నగరాల్లో ఈ జాతీయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 22.79 లక్షల మంది నీట్ రాయనున్నారు.
Academy Awards AI Rules | ఆస్కార్ అవార్డుల్లో కీలక మార్పులు.. ఏఐ వినియోగంపై కొత్త నిబంధనలు!

