Khilla Raghunath Temple Fire | ఖిల్లా రఘునాథ ఆలయ ముఖద్వారం వద్ద అగ్నిప్రమాదం..

నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Khilla Raghunath Temple Fire | నగరం (Nizamabad)లోని ఖిల్లా రఘునాథ ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు, ఫైర్​ స్టేషన్​ అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

Khilla Raghunath Temple Fire | ఆలయంలోని ముఖద్వారం వద్ద..

Khilla Raghunath Temple Fire

రఘునాథ ఆలయం ముఖద్వారం దాటిన తర్వాత రెండు వైపులా రెండు గదులు ఉండగా.. సోమవారం ఉదయం అందులోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే ఫైర్​స్టేషన్​కు, 5వ టౌన్​ పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ ప్రకాశ్, 5వ టౌన్​ ఎస్సై, స్టేషన్​ ఫైర్​ ఆఫీసర్​ శంకర్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్​స్టేషన్​ సిబ్బంది ఆధ్వర్యంలో మంటలు ఆర్పివేశారు. స్టేషన్​ ఫైర్​ ఆఫీసర్​ శంకర్​ ఆధ్వర్యలో లీడింగ్​ ఫైర్​ఫైటర్​ ఏసురత్నం, ఫైర్​ ఫైటర్ శ్రీనివాస్​, సురేదర్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bigala Ganesh Gupta | కేటీఆర్​, హరీష్​రావులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బిగాల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *