Prajavani Applications | ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Prajavani Applications | ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

Prajavani Applications | పెండింగ్​లో ఉంచవద్దు

దరఖాస్తులను పెండింగ్​లో ఉంచకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 66 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Prajavani Applications | ఆర్డీవో కార్యాలయాల్లో…

సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 5 దరఖాస్తులు, అలాగే వేములవాడ (Vemulawada) ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి రెండు దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఎంపీడీవోల ఆధ్వర్యంలో నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బోయినపల్లి ఎంపీడీవో కార్యాలయానికి రెండు, ఇల్లంతకుంట మండలంలో ఐదు, గంభీరావుపేటలో ఐదు, ముస్తాబాద్ మండలంలో ఆరు, రుద్రంగి మండలంలో ఒకటి, తంగళ్లపల్లి మండలంలో మూడు, వీర్నపల్లి మండలంలో రెండు, వేములవాడ రూరల్ మండలంలో రెండు, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో కార్యాలయానికి ఒక దరఖాస్తు వచ్చింది.

ఇది కూడా చదవండి..: Borewell Water Flow | భూపాలపల్లిలో ఊహించని వింత.. మోటార్ లేకుండానే బోర్ల నుంచి వస్తున్న వాటర్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *