అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Census Schedule | తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకోనున్నాయా? అధికార, ప్రతిపక్షాల వ్యూహాలకు పదును పెట్టే అసలైన ‘లెక్కల పోరు’కు తెరలేచిందా? అంటే అవుననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో జనాభా గణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 155 ద్వారా అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
షెడ్యూల్ ప్రకారం 2027 జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్), జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి జనగణన చేపట్టి, మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నారు.
మార్చి 1, 2027 అర్ధరాత్రిని ప్రామాణిక (రిఫరెన్స్) తేదీగా నిర్ణయించారు. అయితే, ఈ సాధారణ పరిపాలనా ప్రక్రియ వెనుక తెలంగాణ భవిష్యత్తు రాజకీయాన్ని శాసించే అతిపెద్ద ‘పొలిటికల్ అజెండా’ దాగి ఉందనే చర్చ మొదలైంది.
Telangana Census Schedule | కుల గణన & బీసీ రిజర్వేషన్లు
అసలు రాజకీయం ఇక్కడే!ఈ జనగణన షెడ్యూల్ వెలువడటం కేవలం జనాభా సంఖ్య సేకరించడానికి మాత్రమే పరిమితం కాదని, ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలకు ఇది అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (కుల గణన) అంశంపై తెలంగాణలో ఇప్పటికే తీవ్రస్థాయిలో రాజకీయ పోరు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ జనగణనలో కులాల వారీగా వివరాలు (ముఖ్యంగా బీసీ జనాభా) పక్కాగా లెక్క తేలితే.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంచాలనే డిమాండ్లపై స్పష్టత వస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు, బీసీ కార్డుతో ముందుకు వెళ్లడానికి ఈ లెక్కలు ఎంతగానో కీలకం కానున్నాయి.
Telangana Census Schedule | డీలిమిటేషన్ సవాల్
జనగణన పూర్తయిన తర్వాతే వివాదాస్పద ‘నియోజకవర్గాల పునర్విభజన’ (డీలిమిటేషన్) ప్రక్రియ వేగం పుంజుకోనుంది. దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గిపోవడం వల్ల పార్లమెంట్ స్థానాలు తగ్గిపోతాయేమోనన్న ఆందోళన తెలంగాణ రాజకీయ నాయకులలో ఉంది. ఈ జనగణన ఆధారంగానే తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు, లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు ఆధారపడి ఉంటాయి.
Telangana Census Schedule | ఓటు బ్యాంక్ అంచనాలు
అర్బన్ వర్సెస్ రూరల్ జనాభా నిష్పత్తి, జనాభా పెరుగుదల తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల వారీగా ఓటర్ల మొగ్గును అంచనా వేసేందుకు ప్రధాన పార్టీలు ఈ డేటాను నిశితంగా గమనించనున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ జనగణన పారదర్శక పాలనకు పరీక్ష కాగా, ప్రతిపక్షాలకు సంక్షేమ పథకాల లబ్ధిదారుల సవరణలు, కుల గణన అజెండాతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ఆయుధంగా మారనుంది. కాబట్టి, రాబోయే రోజుల్లో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై ఏ పార్టీ మైలేజ్ సాధిస్తుందో తేల్చబోయేది ఈ జనాభా లెక్కలేననడంలో ఎలాంటి సందేహం లేదు!