Alternative Crops for Farmers | ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Alternative Crops for Farmers | ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.  గంభీరావుపేట మండలం రాజేశ్వర్​రావు నగర్​లో ‘కేత్​ బచావో అభియాన్’పై మంగళవారం కార్యక్రమం నిర్వహించారు.

Alternative Crops for Farmers | వరి సాగు వద్దు..

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) మాట్లాడుతూ.. సూపర్ ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు వరి సాగు చేయవద్దని సూచించారు. వరి సాగు చేస్తే నీరు భారీగా అవసరమని వెల్లడించారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పొడి ఎండ వాతావరణంతో రానురాను భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని వివరించారు. గంభీరావుపేట మండలంలో గత ఏడాది భూగర్భ జలాలు 5.96 మీటర్ల లోతులో ఉండేవని, ఈ ఏడాది 8.39 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయని తెలిపారు. దీంతో గత నెలలో విద్యుత్ వినియోగం 25 శాతం పెరిగిందని వెల్లడించారు. రైతులు మంచి ఆదాయం వచ్చే.. నీటిని తక్కువగా వినియోగించే పంటలు సాగు చేయాలని సూచించారు.

Alternative Crops for Farmers | ఆయిల్ పామ్​లో మొదటి రెండేళ్లు..

ఆయిల్ పామ్​లో మొదటి మూడు ఏండ్లు అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్, మొక్కలు ఇస్తామని తెలిపారు. వీటి సాగు కోసం డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు వాడి నీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్​కు టన్ను ధర ప్రస్తుతం 22,658 ఉందని వెల్లడించారు. అలాగే జిల్లాకు దగ్గర్లోనే సిద్దిపేటలో జిల్లాలో ఆయిల్ ప్లాన్ ఫ్యాక్టరీ ఉందని వివరించారు. ఆయిల్ ఫామ్ ఉత్పత్తులు సేకరించే కేంద్రం మండలంలోనే ఉందని గుర్తు చేశారు. జిల్లాలో గత సీజన్లో అవగాహన సదస్సులు, కార్యక్రమాలతో 40 వేల ఎకరాల వరకు వరి సాగు తగ్గిందని, 700కు పైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులోకి వచ్చిందని తెలిపారు. పంటల మార్పిడితో నేలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇల్లు, వ్యవసాయ క్షేత్రాల వద్ద నీటి, విద్యుత్ వృథాను అరికట్టాలని పిలుపు నిచ్చారు.

Alternative Crops for Farmers | తెలంగాణ జలసిరి పనులు..

వీబీజీరామ్ జీ కింద జిల్లాలో తెలంగాణ జలసిరి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పామ్ పాండ్ లు నిర్మించుకోవాలని పేర్కొన్నారు. దీంతో భూగర్భ జలాలు వృద్ది చెందుతాయని, పంటల సాగుకు ఉపయోగపడతాయని తెలిపారు. కొందరు రైతులు వాటిలో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత సూపర్ ఎల్​నినో ప్రభావంతో రైతులు నువ్వులు, వేరుశనగ, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ ఫామ్ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహశీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్, సర్పంచ్ పిట్ల బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: EPFO Minimum Pension | నవంబర్ 19న ఢిల్లీలో 240వ సీబీటీ భేటీ.. కనీస పెన్షన్ 3 రెట్లు పెరగనుందా?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *