Telangana Land Resurvey | పకడ్బందీగా భూముల రీసర్వే : మంత్రి పొంగులేటి

భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Land Resurvey | భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) సూచించారు. సచివాలయంలో భూ రీ సర్వే పురోగతిపై రెవెన్యూ ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు.

భూ సర్వే చేసే సమయంలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల నుంచి వస్తున్న స్పందన, సాంకేతిక అంశాలు, సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి ఎదురవుతున్న పరిస్థితులపై మంత్రి చర్చించారు. సర్వేలో పాల్గొంటున్న సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రీసర్వేను పారదర్శకంగా, శాస్త్రీయంగా, పకడ్బందీగా నిర్వహించాలన్నారు. భూ యజమానుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చి, భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించాలని ఆదేశించారు.

Telangana Land Resurvey | వెయ్యి గ్రామాల్లో సర్వే

రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు వెయ్యి గ్రామాల్లో రీసర్వే చేపట్టగా, 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. సర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసి వారి అభ్యంతరాలను పరిష్కరించాలని ఆదేశించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి భూధార్ నంబర్ కేటాయింపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. భవిష్యత్​లో భూ వివాదాలకు తావు లేకుండా సర్వే నిర్వహించాలన్నారు.

దీనిని కూడా చదవండి : TGSRTC Model Bus Stands | టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్టాండ్లు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *