అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. బిల్లులు చెల్లించడానికి కాంట్రాక్టర్‌ను లంచం అడిగిన ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) జాదవ్ సంతోష్‌ను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పట్టణంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు ఆయన రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. గతంలో రూ.10 వేల లంచం తీసుకొని రూ.6,40,000/- విలువైన చెక్కును విడుదల చేశాడు. అనంతరం మిగతా రూ.2,63,128 చెల్లింపునకు చెక్కును విడుదల చేసేందుకుగాను రూ.50 వేలు అడిగాడు.
ACB Trap | ఏసీబీని ఆశ్రయించడంతో..
ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్ సంతోష్ లంచం కోసం వేధిస్తుండటంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మంగళవారం ఫిర్యాదుదారుడి నుంచి సంతోష్ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడి కారులో నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : Chronic Urticaria | దద్దుర్లు వచ్చిన ప్రతిసారీ అదే అలర్జీ అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..