SBI ATM Robbery Attempt | మళ్లీ పెట్రేగిన దొంగలు.. ఎస్​బీఐ ఏటీఎం లూటీకి విఫలయత్నం

జిల్లాలో ఏటీఎం దొంగలు మళ్లీ రెచ్చిపోయారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: SBI ATM Robbery Attempt | జిల్లాలో ఏటీఎం దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. ఏటీఎంలలోనే చోరీలకు యత్నించడం కలకలం రేపుతోంది.

SBI ATM Robbery Attempt | కామారెడ్డి పట్టణంలో..

దాదాపు 20 రోజుల క్రితం గాంధారిలో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ చేసి ఏకంగా రూ.25 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన మరువకముందే కామారెడ్డి (Kamareddy) పట్టణంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. బుధవారం తెల్లవారుజామున ఏటీఎం గదిలోకి ప్రవేశించిన దుండగులు ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎం మిషన్‌ను పగులగొట్టి నగదు అపహరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే వారి యత్నం ఫలించలేదు.

SBI ATM Robbery Attempt | యత్నం విఫలం కావడంతో..

ఏటీఎంలోని నగదుకు ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో బ్యాంకు అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న కామారెడ్డి టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. గాంధారి ఘటనకు, ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. వరుస ఏటీఎం చోరీ యత్నాలతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంల వద్ద భద్రతను పెంచాలని, రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Arya Vaishya Women | శ్రీ వాసవి గ్రేటర్​ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఎన్నిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *