అక్షరటుడే, వెబ్డెస్క్ : 10+2 Education System | రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 10+2 విద్యా విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నామన్నారు.
రాష్ట్రంలో 10+2 విద్యా విధానం ఈ ఏడాది అమలు చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో దానిని వాయిదా వేశారు. దీంతో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు తీసుకున్నారు. అయితే కార్పొరేట్ కాలేజీల ఒత్తిడితో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా సీఎం విద్యా శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు విద్యా విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
10+2 Education System | నాణ్యమైన బోధన
నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు నాణ్యమైన విద్యా బోధన అందించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. 12 వ తరగతి తర్వాత తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని అందులో నిపుణులుగా మారేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలన్నారు. దీంతో ఇంటర్ విద్యా ఉండదు.
10+2 Education System | డ్రాపౌట్స్ పెరగడంతో..
10వ తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. 12వ తరగతి వరకు కొనసాగింపు ఉన్న కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డ్రాపౌట్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటోందన్నారు. 18 రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు విద్యా విధానమే అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణలో సైతం దీనిని అమలు చేయాలన్నారు.
దీనిని కూడా చదవండి : KTR Revanth Reddy | రేవంత్రెడ్డి నా గడ్డం గురించే ఆలోచిస్తుండు : కేటీఆర్