Turmeric Farmers | రైతులు పసుపు పంటను తొందరపడి అమ్మొద్దు

సాంగ్లీ మార్కెట్లో పసుపు ధర పెరగడం రైతులకు హర్షించదగ్గ విషయమని కిసాన్ సెల్​ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Turmeric Farmers | సాంగ్లీ మార్కెట్లో పసుపు ధర పెరగడం రైతులకు హర్షించదగ్గ విషయమని కిసాన్ సెల్​ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు.

Turmeric Farmers | సాంగ్లీ మార్కెట్​లో..

రైతులందరూ తమ పసుపును తొందరపడి అమ్మవద్దని సూచించారు. ఏపీఈడీఏ (APEDA)(ఆపెడ) ద్వారా రైతులు నేరుగా పసుపు ఎగుమతి చేసే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, పసుపును ఇతర దేశాలకు ఏగుమతి చేసి మంచి ధరను పొందాలని పేర్కొన్నారు. పసుపు రైతు ధర పెరగడానికి కృషి చేసిన జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind)​కు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు శేషగిరి లింగం, జిల్లా కార్యవర్గ సభ్యులు చిట్టి భాజన్న తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana University Attack | తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్‌పై సీనియర్ దాడి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *