DEE Illegal Assets | డీఈఈ అక్రమాస్తులు చూస్తే షాక్​ అవ్వాల్సిందే..

నాగర్‌కర్నూల్ జిల్లా నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ సత్యనారాయణ అక్రమాస్తులను ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: DEE Illegal Assets | నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) నీటిపారుదల, సీఏడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ రాగిరి సత్యనారాయణ నివాసాల్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన ఆస్తుల చిట్టాపై శుక్రవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటన విడుదల చేశారు.

డీఈఈ సత్యనారాయణ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుల మేరకు ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి, కర్మన్​ఘాట్​లోని ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన మరో తొమ్మిది ప్రదేశాలలో సోదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, తుక్కుగూడలో డీఈఈ పేరిట 5,200 చదరపు అడుగుల ట్రిప్లెక్స్ విల్లా ఉన్నట్లు గుర్తించారు.

DEE Illegal Assets | 25 ఎకరాల భూమి

కర్మన్‌ఘాట్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో 3-BHK అపార్ట్‌మెంట్, నాగోల్‌లోని రాక్ టౌన్‌లో ఉన్న 2-BHK ఫ్లాట్, వనపర్తి జిల్లాలోని షాపూర్​లో 25 ఎకరాల వ్యవసాయ భూమి, నాగర్‌కర్నూల్‌లో తొమ్మిది ఖాళీ స్థలాలు, షాపూర్​లో ఒక ఫామ్‌హౌస్‌కు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 50 తులాల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. మహీంద్రా XUV 7XO, మహీంద్రా TUV 300, మారుతి సెలెరియో, హ్యుందాయ్ శాంట్రో, బొలెరో అనే ఐదు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.7.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్​లో వీటి విలువ భారీగా ఉంటుందన్నారు.

ఇది కూడా చదవండి..: Kukatpally Truck Park | ట్రక్​ పార్క్​ భూముల వేలాన్ని అడ్డుకుంటాం : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *