అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Telangana Police Sports | 5వ తెలంగాణ(Telangana) రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు వేడుకలు నిజామాబాద్ జిల్లాలో జరుగనున్నాయి. ఈ మేరకు జానకంపేట్‌లో ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం పరిశీలించారు.
Telangana Police Sports | క్రీడాకారులకు ఇబ్బందుల్లేకుండా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్‌మీట్‌కు వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జానకంపేటలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో పరేడ్ గ్రౌండ్, ప్రధాన వేదిక, అతిథుల గ్యాలరీ, క్రీడాకారులు, పోలీస్ సిబ్బందికి సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఐటీ సెల్ ఏసీపీ నరేందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేష్, బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి, ఎంటీవో శేఖర్ బాబు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వినోద్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: అవినీతిలో…లీడర్లను మించిపోతున్న ఆఫీసర్లు