అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CI Bribery Case | రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజలు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సీఐ హోటల్ నిర్వాహకుల నుంచి ప్రతి నెలా రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అతడిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని టోలిచౌకి సీఐ ఎల్ రమేశ్ నాయక్‌ను ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం వివరాలు వెల్లడించారు. సీఐ రమేశ్ ఓ హోటల్ యాజమాన్యాన్ని లంచం డిమాండ్ చేశాడు. రాత్రి ఒంటి గంట వరకు నడుపుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు అంటే ప్రతి నెలా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
CI Bribery Case | రూ.20 వేలు తీసుకుంటుండగా..
సీఐ రమేశ్ నాయక్ మొదటి నెలా రూ.40 వేలు తీసుకొవడానికి ఒప్పుకున్నాడు. అనంతరం ప్రతి నెలా రూ.50 వేలు ఇవ్వాలని చెప్పాడు. ఈ మేరకు అక్టోబర్ 31న రూ.20 వేల లంచం తీసుకున్నాడు. మిగతా రూ.20 వేలు బుధవారం రాత్రి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడి వద్ద తనిఖీలు చేపట్టి లెక్కల్లో చూపని రూ.1.80 లక్షల నగదును గుర్తించారు. ఆ డబ్బులను స్వాధీనం చేసుకొని సీఐని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: Telangana Fancy Number Rules | వాహనదారులకు అలర్ట్.. ఫ్యాన్సీ నంబర్ల గడువు 30 రోజులకు తగ్గింపు..