అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | తెలంగాణ (Telangana)లో పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్న ప్రింటర్లకు బిల్లులు చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ, అందాల పోటీలకు ఖర్చు చేసేందుకు నిధులు ఉంటాయి. కానీ పేద విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను ముద్రించిన వారికి బిల్లులు చెల్లించేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు.
తమకు మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్లు అన్నారు. ఈ మేరకు హరీశ్‌రావును కలిసి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం బిల్లులు ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాఉడూత.. ప్రభుత్వ అవసరాల కోసం పుస్తకాలను ముద్రించి సరఫరా చేసిన చిన్న పరిశ్రమలు బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందన్నారు. 56 మంది వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్లకు సుమారు రూ.76 కోట్ల బిల్లులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
Harish Rao | ఆర్థిక సంక్షోభంలో..
నాణ్యతతో, గడువులో పుస్తకాలను ముద్రించి సరఫరా చేసినా తమకు బిల్లులు రాలేదని ప్రింటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. బిల్లులు రాకపోవడంతో యాజమాన్యాలు కార్మికులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నాయని, పరిశ్రమల అద్దెలు, విద్యుత్ బిల్లులు కట్టలేక చిన్న పరిశ్రమలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రింటర్లకు పెండింగ్‌లో ఉన్న రూ.76 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Indiramma Family Life Insurance | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభించాలి