అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Welfare Schemes | రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
బంజారాహిల్స్‌లోని బంజారా భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు చేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలను మంత్రి సీతక్కతో కలిసి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4.68 లక్షల పెన్షన్లు కొత్తగా మంజూరు చేసిందన్నారు.
Welfare Schemes | అందరికి రేషన్ కార్డులు
తాము అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేశామని పొన్నం పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కొత్తగా అర్హులు ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు అందిస్తామని తెలిపారు. హైదరాబాదులో ఇందిరమ్మ టవర్స్ కట్టి అర్హులకు ఇళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక ఆల పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Harish Rao | పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్న ప్రింటర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్‌రావు