అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ఈరోజు నుంచి సిద్దిపేట (Siddipet) గడ్డ కాంగ్రెస్ అడ్డా అని కార్యకర్తలు నిరూపించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేటలో ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్టాడారు. 1983లో సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మదన్‌మోహన్ నిరూపించారన్నారు. అయితే ఆయన పేరును చరిత్ర నుంచి కనుమరుగు చేయాలని కేసీఆర్, హరీష్‌రావు చేయని కుట్ర లేదని ఆరోపించారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్‌మోహన్ పేరు పెట్టాలని ఆదేశించారు. ఆనాడు సింగిల్ విండో ఎన్నికల్లో కేసీఆర్‌కు మొదటిసారి అవకాశం ఇచ్చిందే మదన్‌మోహన్ అని గుర్తు చేశారు.
CM Revanth Reddy | సిద్దిపేటకు మంత్రి పదవి
2029లో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా సిద్దిపేటలో మామ, మామ పోతే అల్లుడు, బామ్మార్ది వస్తారట అని విమర్శించారు. ఎవడెవడో సిద్దిపేట గడ్డను ఏలడానికి ఇది అనాథల రాజ్యమా అన్నారు. సిద్దిపేటలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం పరోక్షంగా స్పందించారు. ఇటీవల కొందరు నాయకులు మైక్‌లు ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారిని పిచ్చికుక్క కరిసిందేమో అన్నారు. అలాంటి వారిని కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రగడ్డకు పంపుతారని చెప్పారు.
కొంతమంది మా వాళ్లకి ఎర్రికుక్క కరిచినట్లు ఉంది. నిన్న మొన్న చెడు అంతా మైక్‌లో చెప్పి మంచి అంతా ఇంటికొచ్చి నా చెవిలో చెప్తున్నారు. అలాంటి ఎర్రి వాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రగడ్డలో చేర్చాలి – సీఎం రేవంత్ https://t.co/UpxAAA19yO
— Tharun Reddy (@Tarunkethireddy) November 19, 2026
దీనిని కూడా చదవండి : Lakshmi Narasimha Swamy Kalyanam | కమనీయం.. లక్ష్మీనృసింహుని కల్యాణం