Munnuru Kapu Association | పంచముఖి మున్నూరుకాపు సంఘం అభివృద్ధికి తోడ్పాటు: కార్పొరేటర్​ స్రవంతిరెడ్డి

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Munnuru Kapu Association | నగరంలోని 6వ డివిజన్​లో పంచముఖి సంఘం అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని కార్పొరేటర్​ స్రవంతి రెడ్డి (Corporator Sravanthi Reddy) పేర్కొన్నారు. నగరంలోని వినాయక్​ నగర్ పంచ ముఖి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు.

Munnuru Kapu Association | డివిజన్​ అభివృద్ధికి కృషిచేస్తా..

ఈ సందర్భంగా కార్పొరేటర్ స్రవంతి రెడ్డి మాట్లాడుతూ.. ఆరో డివిజన్​లో భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. డివిజన్ అభివృద్ధితోపాటు ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించిన సంఘాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ​(MP Arvind), అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణతో (MLA Dhanpal) మాట్లాడి నిధులు అందేలా చూస్తామన్నారు. సంఘం వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నిస్తామని తెలిపారు.

Munnuru Kapu Association | సంఘానికి నిధులివ్వాలి..

అంతకుముందు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిద్దె రవికుమార్, దారం పోతున్న మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. సంఘం వరకు సీసీ రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. పంచముఖి మున్నూరు కాపు సంఘం తరపున పదోన్నతి పొందిన సభ్యులను, పదో తరగతి, ఇంటర్​లో ప్రతిభ చాటిన సభ్యుల పిల్లలను సన్మానించినట్లు తెలిపారు. అంతకుముందు.. ఇటీవల పదోన్నతి పొందిన చిట్టి నారాయణరెడ్డి, నగుర్త స్వర్ణ లత- రాజేందర్​లను సన్మానించారు. అలాగే కార్పొరేటర్​ స్రవంతిరెడ్డికి సన్మానం చేశారు. కార్యక్రమంలో కోశాధికారి కర్క రమేష్, గౌరవ అధ్యక్షుడు ఆకుల శ్రీశైలం, ముఖ్య సలహాదారు చిట్టి నారాయణరెడ్డి, పెద్ద కాపులు ధర్మేందర్, జగదీష్, ముత్యం, సహాయ కార్యదర్శులు రఘునందన్, జగసంద్రపు లక్ష్మీ నర్సయ్య, సభ్యులు డాక్టర్ రవీందర్, రాజకిషన్, తోట నరేష్, రాజేందర్, లింబాద్రి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Hyderabad Chit Fund Scam | చిట్టీల పేరుతో మరో భారీ మోసం.. కేటుగాళ్లపై బాధితుల ఫిర్యాదు!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *