Godavari Water Supply | తుది దశకు గోదావరి జలాల తరలింపు పనులు

ఎల్​నినో ప్రభావంతో హైదరాబాద్​ నగరంలో తాగు నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Godavari Water Supply | ఎల్​నినో ప్రభావంతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో తాగు నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంజీర–సింగూరుకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు తరలించేందుకు పనులు చేపట్టారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయని జలమండలి ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు.

మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​కు గోదావరి జలాలను తరలించేందుకు చేపడుతున్న 1600 మి.మీ. వ్యాసం గల మిషన్ భగీరథ- జలమండలి పైప్‌లైన్ అనుసంధాన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎండీ అశోక్​రెడ్డి మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డితో కలిసి శుక్రవారం పైప్‌లైన్ అనుసంధాన పనులను పరిశీలించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి, ట్రయల్ రన్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు.

Godavari Water Supply | రాతి పొరలతో జాప్యం

ఈ నెల 15 నాటికే పైప్‌లైన్ నిర్మాణం, అనుసంధానం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే పైప్​లైన్​ మార్గంలో రాతి పొరలు ఉన్నాయి. వాటిని తొలగించాల్సి రావడంతో పనుల్లో ఆలస్యం అయిందని అధికారులు తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో సింగూరు- మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతోంది. దీంతో రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలను నగరానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సింగూరు- మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాలకు నీటి సరఫరాలో ఏర్పడే లోటులో 50 శాతాన్ని గోదావరి అదనపు జలాలను తరలించి భర్తీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి..: Harish Rao | రేవంత్​రెడ్డికి భయం పట్టుకుంది : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *