Indiramma Family Life Insurance | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ఆర్థిక భరోసా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో భరోసా

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల : Indiramma Family Life Insurance | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, ఆపద సమయంలో అండగా నిలవడమే లక్ష్యంగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని 4వ వార్డులో పథకం అమలులో భాగంగా దరఖాస్తులను కలెక్టర్ గరిమ అగ్రవాల్​తో కలిసి స్వీకరించారు.

Indiramma Family Life Insurance | పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ..

ఈ సందర్భంగా బీమా పథకం పోస్టర్లు, కరపత్రాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రూ.5లక్షల జీవిత బీమా అందించడమే ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నంబర్​తో హెల్ప్ డెస్క్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Indiramma Family Life Insurance | వేములవాడ పట్టణ అభివృద్ధికి..

వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, నాలుగో వార్డులో ప్రజలు కోరిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. జమ్మిగద్దె వద్ద దసరా వేడుకలు ఘనంగా నిర్వహించుకునేలా విశాలమైన సీసీ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి రెండు లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. రాజన్న ఆలయ, విస్తరణ అభివృద్ధి పనులు శృంగేరి పీఠాధిపతి సూచనలు, ఆగమ శాస్త్రం, వేద పండితుల సూచనల ప్రకారం ..భక్తుల నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేయిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎవరి సొంత నిర్ణయాలు లేవని స్పష్టం చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా రూ. 250 కోట్లతో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఆలయ విశిష్టత, ఖ్యాతి కి అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. భక్తులు దుష్ప్రచారం నమ్మవద్దని కోరారు. ఆలయ అభివృద్ధి, విస్తరణ లక్ష్యంగా పనులు చేస్తామని స్పష్టం చేశారు.

Indiramma Family Life Insurance | పెన్షన్​ పత్రాల పంపిణీ పూర్తి..

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ఇందిరమ్మ పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. కుటుంబ పెద్ద ఏమైనా కారణంతో చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందుతుందని, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, ఆర్డీవో కేఎస్​బీ కుమారి, నోడల్ అధికారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా ప్రణాళిక అధికారి సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, ఈడీఎం శ్రీనివాస్, వార్డు సభ్యులు తోట రాజు, తహశీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Public Prosecutor caught in ACB trap | న్యాయదేవత సాక్షిగా లంచాల దందా.. ఏసీబీ వలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *