అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lake Restoration | హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా కృషి చేస్తోంది. ఇప్పటికే పలు చెరువులను పునరుద్ధరించి, ప్రారంభించిన హైడ్రా.. ఇటీవల జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించింది. తాజాగా ప్రగతినగర్‌లోని అంబీర్ చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు.
అంబీర్ చెరువును ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రంగనాథ్ తెలిపారు. చెరువు ఆక్రమణలతో పాటు, పూడికను తొలగిస్తామన్నారు. ఈ చెరువు విస్తీర్ణం 162 ఎకరాలు కాగా.. ప్రస్తుతం 121.2 ఎకరాలకే పరిమితమైందన్నారు. అవకాశం ఉన్న మేరకు ఆక్రమణలు తొలగించి దీనిని 135.8 ఎకరాలకు విస్తారిస్తామని వెల్లడించారు. చెరువు చుట్టూ బండ్ ఏర్పాటుతో పాటు.. వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా మారుస్తామన్నారు.
Lake Restoration | బోటింగ్ ఏర్పాటు
చెరువు మధ్యలో ఉన్న కొండల వద్ద సాహస క్రీడలకు ఆస్కారం కల్పిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు బోటింగ్ జెట్టీలను ఏర్పాటు చేసి బోటు షికారును, వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తెస్తామన్నారు. భూగర్భ జలాలు పెంపొందించే విధంగా చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. ప్రగతినగర్‌కు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న చెరువును ముందుగా ఒకవైపు అభివృద్ధి చేసి.. తర్వాత మరో వైపు చేస్తామన్నారు.
దీనిని కూడా చదవండి : Caught by ACB | ఇంటి మ్యుటేషన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన వార్డు ఆఫీసర్