జాతీయంBengal Election Results | బెంగాల్​లో బీజేపీ హవా.. టీఎంసీకి షాక్​ తప్పదా

Bengal Election Results | బెంగాల్​లో బీజేపీ హవా.. టీఎంసీకి షాక్​ తప్పదా

పశ్చిమ బెంగాల్​లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ 134 స్థానాల్లో లీడ్​లో ఉండగా.. టీఎంసీ 111 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengal Election Results | పశ్చిమ బెంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల (bengal election results) ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ అధికార టీఎంసీ(TMC), బీజేపీ(BJP) మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు జరిగింది. అయితే ఫలితాల్లో ప్రస్తుతం మమత బెనర్జీక్​ షాక్​ ఇస్తూ.. బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్​లో ఉంది.

Bengal Election Results | బెంగాల్​లో 293 స్థానాలు..

బెంగాల్​లో(Bengal) 293 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్​ జరిగింది. 148 స్థానాల్లో గెలిస్తే అధికారాన్ని దక్కించుకోవచ్చు. ఇక్కడ కమలం పార్టీ ప్రస్తుతం 134 స్థానాల్లో లీడ్​లో ఉండగా.. టీఎంసీ 111 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రెండింటి మధ్య అంతరం తక్కువగా ఉండటంతో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. మరోవైపు కాంగ్రెస్ 3, ఇతరులు 4 స్థానాల్లో లీడ్​లో ఉన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్​లకు కంచుకోటగా ఉన్న బెంగాల్​లో ప్రస్తుతం ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా లీడ్​లో లేదు.

Bengal Election Results | మమత వెనుకంజ

ముఖ్యమంత్రి మమత బెనర్జీ(mamata banerjee) నందిగ్రామ్​, భవానిపూర్​లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు చోట్ల ఆమె ప్రతిపక్ష నాయకుడు సువేంద్​ అధికారి(suvendu adhikari) పోటీ చేశారు. నందిగ్రామ్​లో సువేంద్​ లీడ్​లో ఉండగా.. మమత బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో సైతం మమతను ఆయన ఓడించిన విషయం తెలిసిందే. భవానిపూర్​లో సైతం ఇప్పటి వరకు సువేంద్​ లీడ్​లో ఉండగా.. తాజాగా మమత ఆధిక్యంలోకి వచ్చారు.

ఇది కూడా చదవండి: Kerala Election Results | కేరళంలో సంచలనం.. అధికార మార్పు దిశగా ఫలితాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Jagadam Naresh CI | బాధ్యతలు చేపట్టిన సీఐ జగడం నరేష్

అక్షరటుడే, కామారెడ్డి: Jagadam Naresh CI | భిక్కనూర్ సీఐగా (Bhikkanoor)...

Vijay TVK Leads | టీవీకే అధినేత విజయ్​ ఇంట్లో సంబరాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay TVK Leads | తమిళనాడు (Tamil...

Kamareddy Fire Accident | చిరు వ్యాపారులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కేవీఆర్​

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fire Accident | అగ్ని ప్రమాదం (Fire...

Puducherry Election Results| తట్టంచావడిలో రంగస్వామి గెలుపు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కోటలు బద్ధలు!

అక్షరటుడు వెబ్‌డెస్క్:Puducherry Election Results|పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి ఫలితం అధికార...