Agriculture College | వ్యవసాయ కళాశాలను జక్రాన్​పల్లిలోనే ఏర్పాటు చేయాలి

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Agriculture College | వ్యవసాయ కళాశాలను జక్రాన్​పల్లి (jakranpally) మండలంలో ఏర్పాటు చేయాలని సర్పంచ్​ల ఫోరం (Sarpanches Forum) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు ప్రజావాణిలో కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

Agriculture College | జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరుపై హర్షం

ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Jayashankar Telangana Agricultural University) రాజేంద్రనగర్​కు అనుబంధంగా నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే జక్రాన్​పల్లి మండల కేంద్రంలో 800 ఎకరాలకు పైగా సారవంతమైన ఎర్ర నేల, భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జాతీయ రహదారికి అతి సమీపంలో కళాశాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలం ఉందని వారు విన్నవించారు.

Agriculture College | దేశంలోనే జక్రాన్​పల్లికి ప్రత్యేకస్థానం..

వ్యవసాయ కళాశాలను జక్రాన్​పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే జక్రాన్​పల్లి మండలంలోని రైతులు ఎంతోమంది అభ్యుదయ అధునాతన వ్యవసాయ విధానాలను అవలంభిస్తూ వాణిజ్య పంటలైన పసుపు, ఎర్రజొన్న, సజ్జలను పండిస్తూ దేశంలోనే ప్రత్యేకంగా నిలిచారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాలను జక్రాన్​పల్లిలోనే ఏర్పాటు చేయాలని కలెక్టర్​ను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్​ల ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kavita Farmers Support | మొక్కజొన్న దగ్ధమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : కవిత

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *