ఆదిలాబాద్Kavita Farmers Support | మొక్కజొన్న దగ్ధమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : కవిత

Kavita Farmers Support | మొక్కజొన్న దగ్ధమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : కవిత

బోథ్ మండలం కనుగుట్టలో మొక్కజొన్న పంట కాలిపోయిన రైతులను ఆదుకోవాలని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత డిమాండ్​ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavita Farmers Support | ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) బోథ్ మండలంలోని కనుగుట్టలో ప్రమాదవశాత్తు వంద ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట కాలిపోవడంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

పంట దహనమై నష్టపోయిన రైతులతో హైదరాబాద్ నుంచి ఫోన్​లో మాట్లాడి ఓదార్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీఆర్ఎస్ నాయకులు బానోత్ మౌనికతో కలిసి బాధిత రైతులతో ఫోన్ లో మాట్లాడారు.కనుగుట్టలో ఇటీవల మంటలు వ్యాపించి మొక్కజొన్న పంట దగ్ధమైన విషయం తెలిసిందే. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో ఆ రైతులు గుండెలవిసేలా రోధించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం సైతం స్పందించారు. తాజాగా కవిత మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. పంట నష్టం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా ఒత్తిడి చేస్తామని భరోసా ఇచ్చారు.

Kavita Farmers Support | సాయం చేయాలి

ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న పంట దహనమై నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని కవిత డిమాండ్​ చేశారు. పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి..: KTR Allegations | మా కెమెరాలు, ఫోన్లు హ్యాక్​ చేస్తున్నారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sun TV Shares | తమిళనాడులో డీఎంకే ఓటమి.. కుప్పకూలిన సన్ టీవీ షేర్లు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sun TV Shares | తమిళనాడు అసెంబ్లీ...

Mamata Banerjee Statement| అంతిమ విజయం తృణమూల్ దే.. బెంగాల్ గడ్డపై దీదీ ధీమా!

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mamata Banerjee Statement| పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల...

Armoor Municipal Commissioner | ఆర్మూర్​ మున్సిపల్ కమిషనర్​గా శ్రీహరి రాజు బాధ్యతల స్వీకరణ

అక్షరటుడే ఆర్మూర్ : Armoor Municipal Commissioner | ఆర్మూర్ మున్సిపల్...

Political Earthquake | బ్లడీ హెల్.. ఇది రాజకీయ భూకంపం! ఐదు రాష్ట్రాల కౌంటింగ్ ట్రెండ్స్‌పై సీఎం ఒమర్ అబ్దుల్లా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Political Earthquake | దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన...