బిజినెస్​Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు

Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగింది. సెన్సెక్స్ 355 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో ముగిశాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళితో భారీ లాభాల దిశగా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ .. తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో వెనక్కి తగ్గింది. చివరికి లాభాలతో ముగిసింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో ప్రారంభమై 28 పాయింట్లు తగ్గింది.

అక్కడినుంచి తిరిగి పుంజకుని 681 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో ప్రారంభమై 2 పాయింట్లు తగ్గినా వెంటనే 229 పాయింట్లు ఎగబాకింది. కౌంటింగ్ సమయంలో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. చివరికి సెన్సెక్స్ 355 పాయింట్ల నష్టంతో 77,269 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 24,119 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market | ఐటీ, టెలికాం, మీడియా రంగాలు మినహా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో ఐటీ, టెలికాం, మీడియా రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్ లు లాభాల బాటలో సాగాయి. ఐటీ ఇండెక్స్ 0.95 శాతం, మీడియా ఇండెక్స్ 0.54 శాతం, టెలికాం 0.13 శాతం నష్టపోయాయి. నిఫ్టీ (Nifty) రియాలిటీ ఇండెక్స్ 2.41 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.11 శాతం, మెటల్ 1.09 శాతం, యుటిలిటీ 1.03 శాతం, ఫార్మా 0.89 శాతం, పవర్ 0.76 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.57 శాతం, ఆటో 0.42 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.38 శాతం లాభపడ్డాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో అదానీపోర్ట్స్ 5.30 శాతం, హెచ్ యÖఎల్ 2.60 శాతం, రిలయన్స్ 2.24 శాతం, ఎల్‌టీ 2.18 శాతం, ఎటర్నల్ 2.09 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎయిర్టెల్ 3.14 శాతం, కొటక్ బ్యాంక్ 2.82 శాతం, టీసీఎస్ 1.76 శాతం, టెక్ మహీంద్రా 0.74 శాతం, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 1.33 శాతం, ఐటీసీ 1.25 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: TVS EV Sales | టీవీఎస్ మోటార్ జోరు.. గణనీయంగా పెరిగిన ఈవీ సేల్స్

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Krishna Water Protest | కృష్ణ జలాల కోసం టీఆర్​ఎస్​ పోరుబాట

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Krishna Water Protest | తెలంగాణ రక్షణ...

CP Sai Chaitanya | బ్యాంకులు, నగల దుకాణాల్లో భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: CP Sai Chaitanya | నిజామాబాద్​ పోలీస్​...

Vijay TVK Victory|తమిళ రాజకీయం ‘విజయ్’మయం.. ద్రావిడ కోటలు బద్ధలు కొట్టిన టీవీకే!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay TVK Victory|తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త శకం...

BJP Bengal Victory | బెంగాల్ గడ్డపై కమల వికాసం.. వైరల్ అవుతున్న బీజేపీ ‘విక్టరీ మ్యాప్’!

అక్షరటుడే వెబ్‌డెస్క్:BJP Bengal Victory|పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా...