అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా కనీసం భయపడటం లేదు. ప్రజల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. తాజాగా ఇంటి పర్మిషన్ కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
జీహెచ్ఎంసీ (GHMC) ఖైరతాబాద్ జోన్ పరిధిలో శ్రీలత జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఆమెను కోరారు. దీనికి శ్రీలత రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాధితుడి నుంచి జూనియర్ అసిస్టెంట్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ (Hyderabad)లోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ శ్రీలతను అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల ప్రిన్సిపాల్ మరియు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.
ACB Case | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : Battery Fan Blast| మెదక్ జిల్లాలో ప్రమాదం.. బ్యాటరీ పేలి తెగిపడిన బాలుడి వేళ్లు !

