హైదరాబాద్Hyderabad Trap Gang | అమ్మాయిలను ట్రాప్​ చేసిన అన్నదమ్ములు.. సహకరించిన తల్లి

Hyderabad Trap Gang | అమ్మాయిలను ట్రాప్​ చేసిన అన్నదమ్ములు.. సహకరించిన తల్లి

హైదరాబాద్​ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు అన్నదమ్ములు ధనవంతులైన అమ్మాయిలను ట్రాప్​ చేసి, బ్లాక్​ మెయిల్​కు పాల్పడ్డారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Trap Gang | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు అన్నదమ్ములు ధనవంతులైన అమ్మాయిలను ట్రాప్​ చేసి, బ్లాక్​ మెయిల్​కు పాల్పడ్డారు. నిందితులకు వారి తల్లి సహకరించడం గమనార్హం.

ఈ ముఠా ప్రధాన సూత్రధారి అర్జున్, అతని సోదరుడు రాజీవ్, తల్లి,మామయ్య, నలుగురు సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్​ సభ్యులు ఇన్​స్టాగ్రామ్ (Instagram)​లో తాము ధనవంతులం అని నటించేవారు. ధనవంతుల కుటుంబాలకు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకునేవారు. వారిని విలాసవంతమైన కార్లలోకి ఆకర్షించి, లైంగిక దాడికి పాల్పడి వీడియోలు చిత్రీకరించేవారు. అనంతరం డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలు వైరల్ చేస్తామని బ్లాక్​ మెయిల్​కు పాల్పడేవారు.

Hyderabad Trap Gang | 19 మందిని..

ఈ కేసులో అర్జున్​, రాజీవ్ 19 మంది మైనర్లను ట్రాప్ చేశారు. ఈ కేసు వివరాలను సీపీ సజ్జనార్​ (CP Sajjanar) వెల్లడించారు. అమ్మాయిలను ట్రాప్ చేసి ఖరీదైన కార్లలోనే లైంగిక చర్యలకు అర్జున్ పాల్పడ్డాడని చెప్పారు. ఇద్దరు నిందితులకు వారి తల్లి మీనాకుమారి కూడా సహకరించినట్లుగా గుర్తించామన్నారు. గుంటూరుకు చెందిన వీరు హైదరాబాద్​కు వచ్చి ట్రాప్​ చేస్తూ మోసాలు చేయడం ప్రారంభించారని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Illegal Mining | అక్రమ మైనింగ్​పై హైడ్రా ఉక్కుపాదం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Biopesticides Usage | పంటలకు బయోపెస్టిసైడ్స్‌ వాడాలి

అక్షరటుడే, మెండోరా: Biopesticides Usage | పంటలకు పురుగు మందులను అవసరమైన...

Stock Market Today | పశ్చిమాసియాలో పెరుగుతున్న టెన్షన్స్.. నష్టాల్లో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు...

Konda Surekha Comments | పుష్కరాలకు ఏపీకి కోట్లు.. తెలంగాణకు సున్నా.. కేంద్రం వివక్షపై సురేఖ ఆగ్రహం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Konda Surekha Comments| ప్రధాని మోదీ పర్యటనలు, బీజేపీ రాజకీయాలపై...

Hajj Subsidy Telangana| హజ్ యాత్రికులకు తెలంగాణ సర్కార్ ఊరట.. అదనపు భారం భరించనున్న ప్రభుత్వం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hajj Subsidy Telangana| పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో...