Stock Market Today | పశ్చిమాసియాలో పెరుగుతున్న టెన్షన్స్.. నష్టాల్లో ముగిసిన సూచీలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండడం, హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)లోని నౌకలతోపాటు UAE పైనా ఇరాన్ దాడులకు పాల్పడడంతో పరిస్థితి దిగజారుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనించాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఉదయం సెన్సెక్స్ 166 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 37 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 625 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 20 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 190 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు తగ్గాయి. చివరికి సెన్సెక్స్ 251 పాయింట్ల నష్టంతో 77,017 వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 24,032 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Today | మిక్స్ డ్ గా సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్ లోని ఇండెక్స్‌లు మిక్స్‌డ్‌గా సాగాయి. నిఫ్టీలో ఎఫ్ ఎంసీజీ ఇండెక్స్ 0.64 శాతం, ఆటో 0.63 శాతం, పవర్ 0.50 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.43 శాతం, టెలికాం ఇండెక్స్ 0.41 శాతం, ఫార్మా 0.40 శాతం పెరగ్గా.. రియాలిటీ 1.41 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.62 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.60 శాతం, ఎనర్జీ 0.42 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.28 శాతం నష్టంతో ముగిశాయి.

Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,998 కంపెనీలు లాభపడగా 2,181 స్టాక్స్ నష్టపోయాయి. 176 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 146 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 28 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో, 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎంఅండ్ఎం 3.41 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.58 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.08 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.87 శాతం, ఇన్ఫోసిస్ 0.80 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఐసీఐసీఐ బ్యాంక్ 1.53 శాతం, ఎటర్నల్ 1.37 శాతం, టెక్ మహీంద్రా 1.28 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.20 శాతం, ఎయిర్ టెల్ 1.08 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Today | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *