అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US plane missing | అమెరికాకు చెందిన భారీ విమానం మిస్ అయింది. బోయింగ్ KC-135 స్ట్రాటో విమానం పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తుండగా రాడార్ నుంచి అదృశ్యం అయింది. అత్యవసర పరిస్థితి ప్రకటిస్తూ ‘7700’ అనే ప్రమాద సంకేతం జారీ చేసినట్టు ఫ్లైట్ రాడార్ డేటా తెలిపింది.
సాధారణంగా సైనిక విమానాలకు గగనతల ఇంధన సరఫరా కేంద్రంగా ఉపయోగించే KC-135 స్ట్రాటోట్యాంకర్, ఇరాన్ (Iran) సమీపంలోని పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు మిస్ అయింది. ఈ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తర్వాత, ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా దాని సిగ్నల్ కోల్పోయింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా సైనిక కార్యకలాపాలకు మద్దతుగా ఈ ట్యాంకర్ చురుకుగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
US plane missing | గాల్లో చక్కర్లు..
విమానం కిందకు దిగడం ప్రారంభించడానికి ముందు కొంతసేపు గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపించింది. పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అత్యవసర పరిస్థితికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు ఏదైనా శత్రు కార్యకలాపాలతో సంబంధం ఉందని అధికారికంగా ఎటువంటి నిర్ధారణ కాలేదు. KC-135 కూలిపోవడం, నష్టం లేదా అత్యవసర పరిస్థితి జరిగినట్లు నిర్ధారణగా సెంట్రల్ కమాండ్ (CENTCOM) లేదా పెంటగాన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య తీవ్రమైన GPS/ఎలక్ట్రానిక్ జామింగ్ కారణంగా అక్కడ రాడార్ డ్రాప్‌లు, 7700 స్క్వాక్‌లు సర్వసాధారణం అని అధికారులు పేర్కొన్నారు. అంతమాత్రాన అది కూలిపోయిందని అర్థం కాదన్నారు.
That was a KC-135 overnight near the hormussy…
Ah tak it these things ar flown by ex indycar or nascar drivers since they only seem tae b able tae turn left?? Kek… 😋 pic.twitter.com/o9ZIoNdCmf
— Raggy… (@raggymerchant) May 5, 2026
దీనిని కూడా చదవండి : Urja Suraksha | ప్రపంచమంతా ఇంధన సంక్షోభం.. ‘ఆపరేషన్ ఊర్జ సురక్ష’తో భారత్ సేఫ్!

