High Court holidays | మే 7 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court holidays | తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు మే 7 నుంచి జూన్​ 5 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో ఆ రోజుల్లో న్యాయస్థానం మూసి ఉంటుంది. ఈ మేరకు హైకోర్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

High Court holidays | వెకేషన్​ బెంచ్​

ప్రతి సంవత్సరం కోర్టులకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది మే 7 నుంచి జూన్​ 5 వరకు హాలీడేస్​ ఉండనున్నాయి. ఆ రోజుల్లో ఏదైనా అత్యవసర కేసులు విచారించాల్సి ఉంటే వెకేషన్​ బెంచ్​ (Vacation Bench) దృష్టికి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ బెంచ్​ మే 14, 21, 28, జూన్ 4 తేదీలలో విచారణ చేపడుతుంది. వీటికి సంబంధించిన దరఖాస్తులను ఆయా తేదీలకు ముందు వచ్చే మంగళవారాల్లో స్వీకరిస్తారు. న్యాయస్థానానికి సెలవులు ఉన్నప్పటికీ, న్యాయం పొందే ప్రక్రియకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేశారు.

దీనిని కూడా చదవండి: ACB Case | ఇంటి పర్మిషన్​ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన జూనియర్​ అసిస్టెంట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *