Sand Quarry Protest | కారేగాం ఇసుక క్వారీ పనులు నిలిపేయాలని గ్రామస్థుల ఆందోళన

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sand Quarry Protest | పోతంగల్​ మండలం కారేగాం (Karegaon) ఇసుక క్వారీలో తవ్వకాలను నిలిపేయాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. ఈ మేరకు బుధవారం లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.

Sand Quarry Protest | మంజీరను ఎడారిలా మార్చేస్తారా..?

ఈ సందర్భంగా పోతంగల్​ మండలం (Pothangal Mandal) కారేగాం గ్రామ సర్పంచ్ సునీల్​ మాట్లాడుతూ.. మంజీర పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయన్నారు. అయితే ఇసుకను అక్రమంగా తోడేస్తూ ఉంటే మంజీర కొన్నిరోజుల్లో ఎడారిలో మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని.. ఫిర్యాదులు ఇచ్చిన అనంతరం కొన్నిరోజులుకు వచ్చి తూతూమంత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోతున్నారని వాపోయారు. మంజీర(Manjeera)ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇసుకను నిరంతరాయంగా తోడేస్తే చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ ఎత్తిపోతాయన్నారు.

మాజీ సర్పంచ్​ సాంబశివరావు మాట్లాడుతూ.. తక్షణమే కారేగాం ఇసుక క్వారీ నుంచి జేసీబీలు, లారీలు వెళ్లకపోతే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అలాగే అనుమతుల పేరుతో రాత్రి 9 గంటల తర్వాత కూడా యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తోడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సతీష్, రామ్ పటేల్, అశోక్, రాజు, నాగనాథ్, శంకర్, శ్రీనివాస్ గజేందర్, రైతులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Solar Power Plant | టీజీ ఎన్పీడీఎస్​ ఆధ్వర్యంలో తొలి సౌర విద్యుత్​ ప్లాంట్​ ఆవిష్కరణ.. డిచ్​పల్లి డివిజన్​ పరిధిలో ప్రారంభం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *