Stock Market | రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాట.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | అమెరికా, ఇరాన్ ల మధ్య అణు ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో మార్కెట్ రోజంతా స్వల్ప ఒడిదొడుకుల మధ్య సాగింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది.

గురువారం ఉదయం సెన్సెక్స్ 381 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా ప్రాఫిట్ బుకింగ్‌తో 541 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 25 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 123 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 114 పాయింట్ల నష్టంతో 77,844 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 24,326 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market | దుమ్మురేపిన ఆటో, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్..

నిఫ్టీ (Nifty)లో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.05 శాతం,ఆటో ఇండెక్స్ 1.93 శాతం, పవర్ 1.23 శాతం, టెలికాం ఇండెక్స్ 0.98 శాతం పెరగ్గా.. ఐటీ 0.77 శాతం, ఎఫ్ఎంసీజీ 0.76 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.52 శాతం నష్టపోయాయి.

Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,735 కంపెనీలు లాభపడగా 1,521 స్టాక్స్ నష్టపోయాయి. 167 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 212 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 21 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2 లక్షల కోట్లమేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో, 19 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎంఅండ్ఎం 2.04 శాతం, ఎన్టీపీసీ 1.46 శాతం, కొటక్ బ్యాంక్ 1.18 శాతం, టాటా స్టీల్ 0.70 శాతం, ఎటర్నల్ 0.57 శాతం, లాభపడ్డాయి.

Top Losers : హెచ్యూఎల్ 1.95 శాతం, టీసీఎస్ 1.38 శాతం, టెక్ మహీంద్రా 1.29 శాతం, టైటాన్ 1.14 శాతం, సన్‌ఫార్మా 1.03 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Tata Sierra EV | టాటా సియెర్రా ఈవీ కారు.. మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *