నిజామాబాద్Kamareddy Co-option Election | ముగిసిన కామారెడ్డి కో–ఆప్షన్​ ఎన్నిక

Kamareddy Co-option Election | ముగిసిన కామారెడ్డి కో–ఆప్షన్​ ఎన్నిక

కామారెడ్డి మున్సిపాలిటీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కోఆప్షన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. గురువారం మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన జిల్లా స్థానిక సంస్థల ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ గిరి ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Co-option Election | కామారెడ్డి మున్సిపాలిటీలో (kamareddy municipality) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కో–ఆప్షన్ ఎన్నిక (co-option election) ఎట్టకేలకు పూర్తయింది. గురువారం మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన జిల్లా స్థానిక సంస్థల ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ గిరి ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు.

Kamareddy Co-option Election | 35 మంది దరఖాస్తు..

కో–ఆప్షన్ పదవికి 35 మంది దరఖాస్తు చేసుకోగా ఇద్దరు ఉపసంహరించుకున్నారు. అందులో ముఖ్యంగా నలుగురు పేర్లు ప్రధానంగా వినిపించాయి. అనుకున్న విధంగానే వారినే కో–ఆప్షన్ పదవులు వరించాయి. గత మున్సిపల్ ఛైర్​పర్సన్ ఎన్నిక (municipal elections) మాదిరిగానే కో–ఆప్షన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ బంధం కొనసాగింది. రెండు పార్టీల మధ్య పరస్పర అవగాహనతో 32 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్​కు 3, బీఆర్ఎస్​కు ఒక కో–ఆప్షన్ దక్కింది. జనరల్ కోటాలో ఒక మహిళ ఒక పురుషుడికి అవకాశం ఉండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కుంబాల రవి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి గోనె సునీత ఎన్నికయ్యారు.

మైనార్టీ కోటాలో అలీబి అబ్దుల్లా, అస్మా అదీన ఖనమ్ ఎన్నికయ్యారు. ఎన్నికైన కో–ఆప్షన్ అభ్యర్థులకు పత్రాలను ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ గిరి అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కో–ఆప్షన్ సభ్యులకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, వైస్ ఛైర్మన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Kamareddy Co-option Election | కో–ఆప్షన్ ఎన్నికపై బీజేపీ కౌన్సిలర్ల విమర్శ

బీఆర్ఎస్, కాంగ్రెస్ బంధం కో–ఆప్షన్ ఎన్నికతో మరోసారి బయటపడిందని బీజేపీ కౌన్సిలర్లు (bjp criticism) తెలిపారు. కో–ఆప్షన్ ఎన్నిక అనంతరం కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు. గురువారం జరిగిన కో–ఆప్షన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్​ఎస్ బంధం మరోసారి బట్టబయలైందని వ్యాఖ్యానించారు. బీజేపీ తరుపున ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy), పార్టీ బలపర్చిన అభ్యర్థులకు 16 మంది కౌన్సిలర్లు ఓటు వేశారని తెలిపారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ములాఖాత్ అయ్యి బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ మూడు చొప్పున పంచుకొని తాము వేరు వేరు కాదని నిరూపించాయని ఎద్దేవా చేశారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిలప్పుడు కూడా ఇలాగే చేశారని, బయట మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు బీఆర్ఎస్ నటిస్తుందన్నారు. కామారెడ్డి ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu Crisis| గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Yellareddy Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని ఒకరి దుర్మరణం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త...

Kodandaram TJS Meeting | ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kodandaram TJS Meeting| గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే...

Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది...

Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mega Job Mela | మెగా...