Telangana Rains | అకాల వర్షానికి తడిసిన ధాన్యం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rains | తెలంగాణలో అకాల వర్షం (Unseasonal Rains) బీభత్సం సృష్టించింది. సాయంత్రం పూట ఒక్కసారిగా భారీ వానపడటంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎండతీవ్రత అధికంగా ఉంది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ (Adilabad), నిర్మల్, నిజామాబాద్, వరంగల్, మెదక్ (Medak)​, కామారెడ్డి జిల్లాల్లో భారీ వాన పడింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్, ధర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

Telangana Rains | తడిసిన ధాన్యం

రాష్ట్రంలో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా గాలులతో కూడిన వాన పడటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పంటను కాపాడుకోవడానికి రైతులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈదురుగాలులకు వడ్ల కుప్పలపై కప్పిన టార్పాలిన్లు సైతం కొట్టుకుపోయాయి. దీంతో ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.

దీనిని కూడా చదవండి : Paddy Farmers | ప్రాణాలు పోతున్న పట్టదా.. కొనుగోలు కేంద్రాల్లో చనిపోతున్న రైతులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *