అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi Airport Marijuana | ఢిల్లీలోని Indira Gandhi International Airport లో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోవియత్నాం నుంచి వచ్చిన ఇద్దరు భారతీయ ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Delhi Airport Marijuana | వియత్నాం నుంచి
అధికారుల వివరాల ప్రకారం.. మే 5న వియత్నాం నుంచి ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు ప్రయాణికులు గ్రీన్ ఛానల్ ద్వారా బయటకు వెళ్లేందుకు యత్నించారు. అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్నాక్స్ ప్యాకెట్లలో అత్యంత చాకచక్యంగా దాచిన గంజాయి బయటపడింది.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు చెప్పారు.
Humanoid Robot Monk | ఆధ్యాత్మిక రంగంలోకి ఏఐ.. దక్షిణ కొరియాలో ‘రోబో సన్యాసి’ అరంగేట్రం!

