తెలంగాణKodangal Development | రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి

Kodangal Development | రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి

అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodangal Development | అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కొడంగల్​లో వేంకటేశ్వర స్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కొడంగల్‌లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 225 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు.

Kodangal Development | పరిశ్రమల ఏర్పాటు

మక్తల్ – నారాయణపేట – కొడంగల్‌కు నీళ్లు, రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం వచ్చిందని సీఎం అన్నారు. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే రెండేళ్లలో ఈ ప్రాంతానికి రానున్నాయని చెప్పారు. మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసి, కృష్ణా నది జలాలతో ఈ ప్రాంత భూములు తడపాలన్నారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తయిందని, పనులు ముందుకు సాగాలన్నారు. కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్‌కు కూడా కేంద్రం సూత్రపాయంగా అంగీకరించిందని తెలిపారు. టేకులగోడు ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. దీంతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు. లగచర్లలో ఇండస్ట్రీయల్​ పార్క్​ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Telangana Law Order| హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్.. అందుకే రాష్ట్రంలో ఈ దారుణాలు: కేటీఆర్

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...