అక్షరటుడే, కామారెడ్డి: BRS BJP Counter | బీఆర్ఎస్, కాంగ్రెస్ జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అంటూ బీజేపీ కౌన్సిలర్లు చేసిన వ్యాఖ్యలను గులాబీ పార్టీ కౌన్సిలర్లు తప్పుబట్టారు. పట్టణంలోని (Kamareddy) మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Former MLA Gampa Govardhan) నివాసంలో శుక్రవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు.
BRS BJP Counter | తాము మద్దతిస్తే తప్పెలా అవుతుంది..
ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. పలు మున్సిపాలిటీలను ఉదహరిస్తూ.. అక్కడ మీరు మద్దతు తెలిపితే తప్పులేదు కానీ.. తాము మద్దతిస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడడం సరికాదన్నారు. ఛైర్మన్, కో–ఆప్షన్ ఎన్నిక సమయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కు మద్దతు తెలపాల్సి వచ్చిందన్నారు. కేవలం కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధి కోసమే మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.
BRS BJP Counter | బీజేపీ నాయకులు..
బీజేపీ నాయకులు భైంసా (Bhainsa), అమన్ గల్, ఖానాపూర్తో(Khanapur) పాలు పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు మద్దతు తెలిపి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు బీజేపీ దక్కించుకోలేదా అని నిలదీశారు. విమర్శలు మానుకుని అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని సూచించారు. బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపనతో కామారెడ్డి అభివృద్ధిని మర్చిపోయారని విమర్శించారు. రెండున్నరేళ్లలో కామారెడ్డికి ఎమ్మెల్యే కేవీఆర్ (MLA KVR) చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాసర్ల గోదావరి-స్వామి, కౌన్సిలర్లు అరికెల ప్రభాకర్ యాదవ్, మామిండ్ల లక్ష్మణ్, మన్సూర్ అలీ, అజీజ్, హఫీజ్ బేగ్, లోలం శ్రీనివాస్, కో–ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Crude Oil Prices| చమురు సంస్థలకు రూ.30 వేల కోట్ల నష్టం.. భారం పడకుండా కేంద్రం కీలక వ్యూహం

