EV Auto Conversion | ఆటో డ్రైవర్లకు గుడ్​న్యూస్​.. ఈవీ వాహనాలుగా మారుస్తామని సీఎం ప్రకటన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : EV Auto Conversion | హైదరాబాద్‌ (Hyderabad)ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్న ఆటోలకు ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయించడానికి 5 కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.

హైదరాబాద్ (Hyderabad) హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. హజ్​ యాత్రకు వెళ్తున్న వారికి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

EV Auto Conversion | రూ.10 వేల అదనపు భారం

ఇరాన్ (Iran) యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ రేట్లు పెరిగాయన్న కారణం చూపించి హజ్ యాత్రికులు ఒక్కొక్కరిపై రూ. 10 వేల అదనపు భారం మోపారని సీఎం తెలిపారు. చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది భరించలేని పరిస్థితులు ఉన్నందున 7 వేల మంది హాజీలపై పడిన అదనపు భారం ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మైనారిటీల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు.

ఇది కూడా చదవండి : Musi Project Works | రూ.7,055 కోట్లతో మూసీ ప్రాజెక్ట్​ పనులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *