నిజామాబాద్Farmers Protest Movement | దేశవ్యాప్త రైతాంగ పోరాటాలను ఉధృతం చేస్తాం : ఏఐయూకేఎస్​ రాష్ట్ర...

Farmers Protest Movement | దేశవ్యాప్త రైతాంగ పోరాటాలను ఉధృతం చేస్తాం : ఏఐయూకేఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్

దేశవ్యాప్త రైతంగా పోరాటాలను ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నామని ఏఐయూకేఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: దేశవ్యాప్త రైతాంగ పోరాటాలను ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నామని ఏఐయూకేఎస్(AIUKS)​ రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

Farmers Protest Movement | సంక్షోభంలో వ్యవసాయ రంగం

 దేశంలో వ్యవసాయం పూర్తిగా తీవ్రమైన సంక్షోభంలో(agriculture crisis) ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికే అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) రైతులను సంఘటితం చేసి పోరాటాలు చేస్తోందని వివరించారు. ప్రధాని మోదీ(PM Modi) అదాని, అంబానీ లాంటి కార్పొరేట్లకు కీలుబొమ్మగా మారి పూర్తిగా వ్యవసాయ రంగాన్ని వారికి అప్పగిస్తూ రైతులను బలి పశువులు చేస్తున్నారన్నారు. ఎంఎస్​పీ చట్టం కోసం ఏళ్లుగా రైతాంగం పోరాడుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

Farmers Protest Movement | ప్రథమ మహాసభలు

కార్పొరేట్​ కంపెనీల మెప్పు కోసమే ఎంఎస్​పీ చట్టం(MSP law) చేయడం లేదని ప్రభాకర్​ అన్నారు. ఇక్కడ అనేక వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా అమెరికాలాంటి దేశాలకు తలొగ్గి దిగుమతులు చేసుకుంటూ ఇక్కడ మన వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం పోరాటాలు చేయాల్సి వస్తోందన్నారు. అందులో భాగంగానే 16 రాష్ట్రాల్లో ఉన్న రైతు సంఘాలను ఐక్యం చేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) ఏర్పడిందని ప్రస్తుతం జాతీయ ప్రథమ మహాసభను బద్రాద్రి కొత్తగూడెంలోని ఇల్లెందులో మే 11,12,13 తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభల్లో 16 రాష్ట్రల నుండి 300 మంది ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. రైతాంగా ఉద్యమలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి, భవిష్యత్ ఉద్యమాలకు  సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మహాసభలకు జిల్లానుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని కోరారు.

ఇది కూడా చదవండి: Vijay Welfare Schemes| ముఖ్యమంత్రిగా విజయ్ తొలి అడుగు.. ఉచిత విద్యుత్, ఫ్రీ బస్ ప్రయాణంపై తొలి సంతకాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SIR Mapping Process | ఓటర్లంతా ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేయించుకోవాలి..

అక్షరటుడే, ఇందూరు: SIR Mapping Process | నిజామాబాద్ నగర పాలక...

Modi Hyderabad Visit | హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Hyderabad Visit | ప్రధాన మంత్రి...

Inter Supplementary Exams | నిఘా నీడలో ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు : డీఐఈవో రవికుమార్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Inter Supplementary Exams | కట్టుదిట్టమైన సీసీకెమెరాల...

Patancheru Cylinder Blast | హోటల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. కిలోమీటరు మేర వినిపించిన శబ్దం

అక్షరటుడే వెబ్‌డెస్క్:Patancheru Cylinder Blast | సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణ...