Stock Market Crash | భారీ నష్టాల్లో సూచీలు..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | కొనసాగుతున్న అమెరికా -ఇరాన్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశీయ స్టాక్ మార్కెట్ ను కోలుకోనీయడం లేదు. గ్లోబల్ మార్కెట్లు (Global Markets) సైతం బలహీనంగా ఉండడం, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగిస్తుండడం, రూపాయి బలహీనతతో ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్ మరియు నిఫ్టీ భారీగా నష్టపోతున్నాయి.

Stock Market Crash | వరుసగా నాలుగో సెషన్‌లోనూ..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) వరుసగా నాలుగో సెషన్‌లోనూ నష్టాలబాటలో పయనిస్తోంది. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 327 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 53 పాయింట్లు పెరిగింది. అయితే అమ్మకాల ఒత్తిడితో 721 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 35 పాయింట్లు పెరిగింది. అక్కడి నుంచి 180 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 834 పాయింట్ల నష్టంతో 75,181 వద్ద, నిఫ్టీ 231 పాయింట్ల నష్టంతో 23,584 వద్ద ఉన్నాయి.

Stock Market Crash | ఐటీలో సెల్లాఫ్..

ఐటీ రంగ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.62 శాతం నష్టపోయింది. రియాలిటీ 2.27 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 1.85 శాతం, మీడియా 1.54 శాతం, యుటిలిటీ 1.53 శాతం నష్టాలతో ఉండగా.. ఆయిల్ అండ్ గ్యాస్ 0.73 శాతం, ఎనర్జీ 0.58 శాతం మెటల్ 0.48 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ లాభాలతో, 26 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ 0.88 శాతం, ఎయిర్‌టెల్ 077 శాతం, టాటా స్టీల్ 0.73 శాతం, రిలయన్స్ 0.03 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టీసీఎస్ 3.99 శాతం, ఇన్ఫోసిస్ 3.76శాతం, టెక్ మహీంద్రా 3.63 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.37 శాతం, అదానీపోర్ట్స్ 2.59శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Tech Layoffs 2026 | ఏఐ ఎఫెక్ట్‌తో టెక్ రంగంలో భారీ లేఆఫ్స్.. ఐదు నెలల్లో 92 వేల ఉద్యోగాలు మాయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *