Tanuja Murder Case | రిటైర్డ్​ ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనుషుల విషయంలో పోలీసుల కీలక హెచ్చరిక

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tanuja Murder Case |హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజా దారుణ హత్యకు గురైన ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

Tanuja Murder Case | పోలీసుల హెచ్చరికలు..

ఈ నేర నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇంట్లో నేపాలీ పనిమనుషులను పెట్టుకునే యజమానులకు పోలీసులు పలు సూచనలు జారీ చేశారు. నేపాలీలను పనిమనుషులుగా నియమించుకునే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నేపాలీలు పని చేస్తున్న ప్రతి ఇంటికి పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. యజమానులు తమ వద్ద పనిచేసే వారి వివరాలను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలి. పనిమనుషుల వ్యక్తిగత వివరాలు, వారి ఫోటోలు, ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు, వారు ఎవరి ద్వారా పనిలోకి చేరారనే పూర్తి సమాచారాన్ని పోలీసులకు అందజేసి పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tanuja Murder Case | కొనసాగుతున్న విచారణ

తెలియని వ్యక్తులను, ముఖ్యంగా ఇతర దేశాల నుండి వచ్చిన వారిని ఎటువంటి ధృవీకరణ లేకుండా పనిలో పెట్టుకోవడం ప్రమాదకరమని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిందితులను పట్టుకోవడం కష్టమవుతుందని పోలీసులు స్పష్టం చేశారు. తనూజా హత్య , దోపిడీ కేసులో నిందితులు ఇప్పటికే సరిహద్దులు దాటే అవకాశం ఉందని భావించిన పోలీసులు, ఇతర రాష్ట్రాల పోలీసుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఈ ముఠా గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

 

ఇది కూడా చదవండి: Paddy Farmers | ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *