అక్షరటుడే, ఆర్మూర్: MLA Paidi Rakesh Reddy | వంజరులు రాజకీయాల్లో (vanjari community) చురుకుగా పాల్గొనాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (paidi rakesh reddy) అన్నారు. మామిడిపల్లిలోని వంజరి కల్యాణ మండపంలో నిర్వహించిన సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
MLA Paidi Rakesh Reddy | వంజరుల మద్దతు మరిచిపోలేనిది..
ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా వంజరి సంఘం నూతన అధ్యక్షుడిగా మాస్టర్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా ధాత్రిక వేణుగోపాల్, కోశాధికారిగా కరిపె మధుసూదన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రస్థానంలో వంజరి కులస్థుల మద్దతు ఎప్పటికీ మరువలేనిదన్నారు. ప్రతి ఎన్నికల్లో.. ప్రతి అడుగులో నాకు అండగా నిలిచిన వంజరి సమాజానికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. వంజరి సంఘం అభివృద్ధి కోసం, యువత ప్రగతి, విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్నివిధాలా సహకరిస్తానన్నారు. అలాగే వంజరి సమాజం ఐక్యంగా ముందుకు సాగితే మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం పసుపు బోర్డు ఛైర్మన్ (Turmeric Board) పల్లె గంగారెడ్డి, ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా (NUDA) ఛైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ.. వంజరి సమాజం ఐక్యతకు ప్రతీక. సమాజ అభివృద్ధి కోసం చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు బోనేకర్ భూమయ్య, మాజీ కార్యదర్శి మల్లేష్, మాజీ కోశాధికారి నర్సయ్య, రాష్ట్ర వంజరి సంఘం అధ్యక్షుడు కాలేరు నరేష్, కార్యదర్శి కొండల్, కోశాధికారి అమరేందర్, మాస్టర్ శ్రీనివాస్, సర్పంచ్ కూన లలిత సాగర్, గంగోనె గంగాధర్, గంగోనె సంతోష్, గోపాల్ శ్రీధర్, కరిపే గణేష్, అమంద్ విజయ్ కృష్ణ, బర్ధన్ సతీష్, నవతే సతీష్, పటేవార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Gold ETF Surge | సుంకాల ప్రభావం.. భారీగా పెరిగిన ఈటీఎఫ్ లు

