Bakrid Security Measures | బక్రీద్‌కు పటిష్ట భద్రత: ఎస్పీ రాజేష్ చంద్ర

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Bakrid Security Measures | రానున్న బక్రీద్ (Bakrid) పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 24 గంటలు పనిచేసే ప్రత్యేక జిల్లా పోలీస్ కంట్రోల్ రూంను (Kamareddy Police) ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Bakrid Security Measures | శాంతిభద్రతలను కాపాడేందుకు..

జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో ఆరు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఎస్పీ వివరించారు. అనుమానాస్పద ఘటనలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 87126 86133 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వాహనాలను ఆపడం, తనిఖీలు చేయడం వంటి అధికారం కేవలం ప్రభుత్వ విభాగాలకే ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. వ్యక్తులు లేదా సంస్థలు స్వయంగా తనిఖీలకు దిగితే చట్టపరంగా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో విద్వేషపూరిత, రెచ్చగొట్టే పోస్టులు, మత సామరస్యాన్ని దెబ్బతీసే వీడియోలు ప్రచారం చేసే వారిపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులతో సహకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి: RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *